News

ఎట్టకేలకు కుకీ-జో తెగల మధ్య కుదిరిన ఒప్పందం

130views

మణిపుర్ కు సంబంధించి కేంద్రం, కుకీ-జో తెగల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇందులో మణిపుర్ ప్రభుత్వం కూడా భాగ స్వామి. గత కొంతకాలంగా జరుగుతున్న సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా మూడు పక్షాలూ.. కొత్త సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ (ఎస్వోవో) ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా మణిపుర్ ప్రాదేశిక సమగ్రతను గుర్తించేందుకు కుకీ సంస్థలైన కుకీ నేషనల్ ఆర్గ నైజేషన్ (కేఎన్వో), యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ (యూపీఎఫ్) అంగీకరించాయి. ఇదో సానుకూల పరిణామం. అంతేకాదు, జాతీయ రహదారి-2ను తెరవడానికి కూడా కుకీలు ఆమోదం తెలిపినట్లు కేంద్రం హోంమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో అత్యవసర సరకుల రవాణాకు, సాధారణ ప్రజల ప్రయాణాలకు మార్గం సుగమం కానుంది. వచ్చే వారం మణిపుర్ లో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఒప్పందం కుదరడం గమనార్హం.