News

ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ధైర్యంతో గణేష్ మండపాల ఏర్పాటు

198views

ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఇచ్చిన ధైర్యంతో గణేష్ మండపం ఏర్పాటు చేసుకోగలిగామని కృష్ణరాజపురంలో (క్రీస్తు రాజపురం) వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడ నగరంలోని కృష్ణరాజపురంలో (క్రీస్తు రాజపురం) హిందువులు మైనార్టీలు. అక్కడ గత ఏడాది వరకు గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే గంట గంటకి కంప్లైంట్ పెట్టడం, పోలీసులు నిర్వాహకులను పిలవడం లేదా రావడం గణేష్ మండపాన్ని ఇక్కడ పెట్టవద్దు, క్రైస్తవ మతస్తులకి ఇబ్బంది అవుతున్నది అని ఆపేవారు. మీరు వెలిగించే అగరవత్తి వాసన ఆ మతస్తులకు ఇబ్బంది కలిగిస్తున్నదని, మండపం నుండి పూజా మంత్రాలు, పాటలు వినిపిస్తున్నాయని సాయంత్రం భజనలు చేసి మాకు ఇబ్బంది కలిగిస్తున్నారని కారణాలతో కంప్లైంట్ పెట్టేవారు.

ఈ కష్టాలలో విగ్నేశ్వరుడు గణేష్ ఉత్సవ సమితి మా కోసం ఏర్పడిందని తెలిసి స్థానిక సమితి సభ్యులను కలిసినప్పుడు మీరే ఈ ఏరియాలో సమితి సభ్యులుగా ఉండాలని పెద్దలతో కలిపి మమ్మల్ని సమితిలో చేర్చారని తెలిపారు.

గతంలో పర్మిషన్ కోసం ఎన్నో ఆఫీసులను తిరిగి అనుమతి తెచ్చుకోవడానికి నానా కష్టాలు పడి రుసుముల చెల్లించి, అదనంగా కానుకలు ఇచ్చిన స్థితి నుండి సమితి ద్వారా వచ్చిన సింగిల్ విండో పద్ధతిలో నమోదు వలన చిటికెలో పని పూర్తయిందని ఇది ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ఏ ఇబ్బంది వచ్చినా గణేష్ ఉత్సవ సమితి వారి పేరు చెప్పడంతో సమస్యలని తొలగిపోయాయని వారి అండ ఒక బలాన్ని ఇచ్చి ఇబ్బంది రాకుండా కాపాడిందని సంతోషం వ్యక్తం చేశారు.

స్టానిక ప్రాంతంలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ పాకాల త్రినాథ్ గారు ఎప్పటికప్పుడు సలహాలు ధైర్యాన్ని ఇచ్చి ఇచ్చారని తద్వారా చిన్న చిన్న మండపాలకు సహాయ సహకారాలు అందాయని తెలిపారు.

మండపాలను ప్రధాన కార్యదర్శి గారు సందర్శించినప్పుడు ధార్మిక చింతన,సామాజిక సద్భావన,పర్యావరణ పరిరక్షణ ఆలోచన గురించి కొన్ని ఉదాహరణలు తెలిపారని ఇక నుండి ఆచరిస్తామని ఆనందంతో చెప్పారు.

ఈ మండపాల సందర్శనంలో ఎన్టీఆర్ జిల్లా ఉత్సవ సమితి సభ్యుడు శ్రీ చింతిరాల నాగభూషణం,సిద్ధార్థ నగర్ ఏరియా ఉత్సవ సమితి కో కన్వీనర్ శ్రీ వై.దుర్గారావు, సభ్యులు శ్రీ బూర రమణ,శ్రీ రామదాసు తదితరులతో కలిసి మండపాలను సందర్శించారు.