News

ఆధునిక పరిశోధనలకు గిరిజన జ్ఞానం దోహదం

174views

గిరిజన జ్ఞాన సంపదను ఆధునిక పరిశోధనలతో అనుసంధానం చేయడం సమగ్ర సమాజ నిర్మాణానికి కీలకమని పద్మశ్రీ చెరువాయల్‌ రామన్‌ అన్నారు. స్థానిక కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో ధర్తి ఆబా భగవాన్‌ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని ‘గిరిజన జ్ఞాన వ్యవస్థ : సర్దుబాటు మరియు సమగ్రత’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు సంప్రదాయ వ్యవసాయం, మూలికా వైద్యం, ప్రకృతి వైద్య విధానాలు శాసీ్త్రయంగా అభివృద్ధి చెందితే సమాజానికి మరింత మేలు చేస్తాయని సూచించారు. అనంతరం ఆయన్ని యూనివర్సిటీ ఘనంగా సత్కరించింది. విద్యార్థులు ప్రదర్శించిన థింసా నృత్యం ఆకట్టుకుంది. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జితేంద్రమోహన్‌ మిశ్రా, డాక్టర్‌ సీత కక్కోత్‌, ప్రొఫెసర్‌ శరత్‌ చంద్రబాబు, డాక్టర్‌ నగేష్‌, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.