News

సముద్ర తీరంలో బయల్పడిన శ్రీకృష్ణుని విగ్రహం

243views

మ బాపట్ల జిల్లా , చిన్నగంజాం మండలం మోటుపల్లి గ్రామంలోని సముద్ర తీర ప్రాంతంలో పురాతన శ్రీకృష్ణుడి విగ్రహం బయటపడింది. చవితి వేడుకల్లో భాగంగా గణనాథుడి నిమగ్న కార్యక్రమాలకు వెళ్ళిన భక్తులకు తీరంలో ఓ నల్లటి రాయి కనబడటంతో భక్తులు పరిశీలించారు. ఈ క్రమంలో అక్కడ తవ్వి చూడగా సుమారు మూడు అడుగుల ఎత్తు, అర్ర అడుగు వెడల్పు కలిగిన శ్రీకృష్ణుని విగ్రహం భక్తుల కంటబడింది. ఇక విగ్రహం లభ్యమైన విషయం షయం ఆనోట ఈనోట ప్రచారం జరిగి పెద్ద ఎత్తున భక్తులు సముద్రతీరానికి చేరుకొని శ్రీకృష్ణుని విగ్రహానికి పూజలు నిర్వహించారు. సమాచారం అందుకున్న చిన్నగంజాం మండల తహసిల్దార్ ప్రభాకర్ రావు విగ్రహ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో విగ్రహాన్ని ఆర్కాలజిస్ట్ అధికారులకు అప్పగించనున్నట్లు తహసీల్దార్ తెలియజేశారు.