News

గో సంపదతో అద్భుతాలు

166views

వ్యవసాయం, అన్నా డైరీ వ్యాపారం అన్నా లాభాలు రావేమో అనే భయం చాలామందిని వెంటాడుతుంది. కానీ ఐదెంకల జీతాన్నిచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదులుకొని మరీ విజయం సాధించారో ఐటీ జంట. సేంద్రీయ పద్దతుల ద్వారా ఆర్గానిక్ పాల ఉత్పత్తులను అందిస్తూ ఏడాదికి కోట్లలో ఆర్జిస్తున్నారు. అయితే ఈ ప్రయాణం వెనకాల ఒక విషాదగాథ కూడా ఉంది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన శ్రీకాంత్ మాల్డే, అతని భార్య చార్మి మాల్డే తమ లాంటి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఐటీలో బీఈ, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిప శ్రీకాంత్ దశాబ్ద కాలం ఐటీ కెరీర్‌ను వదిలేశారు.అలాగే కెమికల్ ఇంజనీర్ అయిన చార్మికూడా భర్తనే అనుసరించి ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదులుకుంది. అర్థవంతమైన, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలనే ఉద్దేశంతోపాటు కల్తీలేని పాల ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతో డైరీ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. 2014లో ముఖ్యంగా శ్రీకాంత్ తండ్రి క్యాన్సర్‌తో మరణించడం వారిని ఆలోచింప చేసింది.

“> సేంద్రీయ వ్యవసాయంపై వారి పరిశోధన ఆవుల కీలక పాత్రను గుర్తించేలా చేసింది. కేవలం పాల కోసం మాత్రమే కాకుండా, ఆవు పేడ , మూత్రం వంటి సహజ ఎరువుల ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా అని గ్రహించారు.దీంతో 2017లో, కేవలం నాలుగు గిర్ ఆవులతో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గౌనీతి ఆర్గానిక్స్ ప్రారంభించారు. పాడి పరిశ్రమలో ముందస్తు అనుభవం లేకపోయినా, సానుకూల స్పందన వారికి ఊతమిచ్చింది. మొదటి 5-6 సంవత్సరాలు కొన్ని చాలెంజెస్‌ విసిరినీ,వాటిని అధిగమించారు. ఎన్ని కష్టాలొచ్చినా కానీ స్వచ్ఛమైన, కల్తీ లేని పాలను అందించాలనే పట్టుదలతో కొనసాగాగారు. ఆహార కల్తీ, అనారోగ్యకరమైన ఆహారంపై ఆందోళన, సహజమైన, నమ్మదగిన ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్న జనం వీరికి బ్రహ్మరథం పట్టారు. అలా కేవలం నాలుగు ఆవులతో ప్రారంభమై 2024 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2 కోట్లకుపైగా టర్నోవర్‌ను చేరుకున్నారు.

ప్రస్తుతం 100 ఆవులతో, ఆర్గానిక్ పాలు, వెన్న, నెయ్యి, అగరుబత్తులను కూడా విక్రయిస్తున్నారు. అంతేకాదు స్థానిక మహిళలకు స్థిరమైన జీవనోపాధిని కల్పిస్తుంది. అభిరుచి, పట్టుదలతో పాటు, తాము అందించే ఉత్పత్తుల్లో స్థిరత్వాన్ని, నాణ్యతను అందిస్తే విజయం వంగి సలాం చేస్తుందనటానికి ఈ దంపతులు నిదర్శనంగా నిలిచారు