News

అహ్మదాబాద్‌లో దారుణం.. టెన్త్ విద్యార్థిని చంపిన ముస్లిం విద్యార్థి

238views

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థి-తొమ్మిదో తరగతి విద్యార్థి మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. దీంతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. స్కూల్ ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.

అహ్మదాబాద్‌లోని ఖోఖారాలోని సెవెంత్ డే స్కూల్. అదే స్కూల్‌కు చెందిన టెన్త్ విద్యార్థి- 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరి మధ్య ఘర్షణ కారణంగా స్కూల్ వెలుపల టెన్త్ విద్యార్థిని కత్తితో పొడిచాడు. దీంతో బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

ఈ హత్య తర్వాత సింధీ కమ్యూనిటీకి చెందిన సభ్యులు పెద్ద ఎత్తున . పాఠశాల ఆవరణలో నిలబడి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితుడు సింధీ వర్గానికిి చెందిన వాడు కాగా.. నిందితుడు ముస్లిం వర్గానికి చెందిన వాడు కావడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రస్తుతం హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఇక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకోవైపు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.