
172views
కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్పస్వామి ఆలయం తలుపులు తెరచుకున్నాయి. చింగం మాస పూజల కోసం ఆలయ పూజారులు తలుపులు తెరిచారు. ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి సమక్షంలో ఆలయ దీపాలను, ఆళి (పవిత్ర అగ్నిగుండం)ని వెలిగించారు. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా వేల మంది భక్తులు ఈ వేడుకను తిలకించారు. చింగం మాస పూజలు పూర్తయ్యే వరకు పడిపూజ కార్యక్రమం ప్రతిరోజూ సాయంత్రం 6:30 గంటలకు జరుగుతుందని, సెప్టెంబరు 20న పంబా నది ఒడ్డున ‘గ్లోబల్ అయ్యప్ప సమా ‘వేశం’ భారీఎత్తున నిర్వహి స్తామని దేవాదాయ శాఖ మంత్రి వి.ఎన్. వాసవన్ ప్రకటించారు. ఇంత పెద్దఎత్తున సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి అని, ఇది చరిత్రాత్మక కార్యక్రమంగా నిలవనుందని తెలిపారు. వివిధ దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరవు తారని భావిస్తున్నట్లు తెలిపారు.





