News

లవ్ జిహాద్ కేసును నీరు గార్చేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్న కేరళ సర్కార్

222views

తాజాగా కేరళలోని కొత్త మంగళం లవ్ జిహాద్ కేసును నీరు గార్చేందుకు కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం కృతనిశ్చయంతో వున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.ఈ లవ్ జిహాద్ కేసులో ప్రధాన నిందితుడు రమీజ్ పై అతి స్వల్పమైన, అతి సులువైన కేసులను మాత్రమే పోలీసులు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం (IPC 306), పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, లైంగిక వేధింపులకు పాల్పడం వంటి స్వల్ప అభియోగాలను మాత్రమే నమోదు చేశారు. లవ్ జిహాద్ అన్న ప్రస్తావననే తీసేశారు. రాష్ట్ర హోంశాక కూడా ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ దగ్గరే వుంది.

అయితే ఇదంతా ఉన్నతాధికారుల జోక్యం వల్లనే జరిగిందని తెలుస్తోంది. అంతేకాకుండా సీపీఎం నాయకత్వం కూడా ఇందులో జోక్యం చేసుకుంది. లవ్ జిహాద్ తో ఆత్మహత్య చేసుకున్న మృతురాలు హింస, మానసిక ఒత్తిడి, మానసిక ఒత్తిడి భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

బాధితురాలి తల్లి మరియు ఆమె సోదరుడు బాసిల్ ఇదే వాంగ్మూలం ఇచ్చారు. దీనిని ముఖ్యమంత్రి ఆధీనంలో వున్న పోలీసు శాఖ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు.బదులుగా, ఎఫ్ఐఆర్‌లో దూరపు బంధువు ఎల్డోస్ విల్సన్ వాంగ్మూలాన్ని చేర్చారు, అతను దూరంగా నివసిస్తున్నట్లు తెలుస్తోంది. సోనా నిరాశ కారణంగా ఆత్మహత్య చేసుకుందని అతను పేర్కొన్నాడు.

సోనా మరణ వివరాలను లేదా ఆమె సూసైడ్ నోట్‌లోని విషయాలను ప్రజలకు వెల్లడించవద్దని పోలీసులు ఆమె కుటుంబ సభ్యులను ఆదేశించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 10న ఆమె అంత్యక్రియలు జరిగిన తర్వాతే ఆ కుటుంబం సూసైడ్ నోట్ గురించి వివరాలను వెల్లడించింది.

మరోవైపు ఈ మరణం, సూసైడ్ నోట్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మృతురాలు ఇంటికి వచ్చి పోలీసులు స్టేట్ మెంట్ తీసుకున్నారు. సోనా తల్లి మొదట్లో రమీజ్‌పై అధికారిక ఫిర్యాదు లేకపోవడం వల్లే అరెస్టు ఆలస్యమైందని భావించింది. తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది కానీ వారు దానిని అంగీకరించడానికి నిరాకరించారు. అప్పుడే సోనా తల్లి మరియు సోదరుడు సూసైడ్ నోట్‌లోని విషయాలను ప్రజలకు వెల్లడించారు.సోనా తల్లి ఇప్పుడు తన కూతురి మరణంపై NIA దర్యాప్తు కోరుతోంది.