News

మహారాష్ట్రలో 15న మాంసం అమ్మకాలపై నిషేధం

181views

మహారాష్ట్రలో ఆగస్టు 15న గోకులాష్టమి సందర్భంగా.. ఆగస్టు 20న జైన పండుగ పర్యుషణ్ పర్వ సందర్భంగా కబేళాలు, మాంసం దుకాణాలు మూసేయాలని ఛత్రపతి శంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కబేళాలు, మాంసం దుకాణాలను మూసివేయాలని మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే కళ్యాణ్ డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్, మాలేగావ్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఆగస్టు 15న మాంసం అమ్మకాలు చేయొద్దని ఉత్తర్వులు జారీ చేశాయి.

పర్యావరణ, జంతు సంక్షేమం, సాంప్రదాయ విలువల పరిరక్షణ పేరుతో అధికారాలు ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. దీనిపై మాంసం వ్యాపారులు, హోటల్ యజమానులు, పౌర సమాజంలోని విభిన్న వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశంపై ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో #MeatBan, #FoodFreedom వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. మాంస నిషేధం అనుకూల, ప్రతికూల వర్గాలు నెట్టింట పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.