NewsProgramms

దివ్యాంగుల ‘భవిత’కు శీతల నీటియంత్రం వితరణ

732views

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతుల నిపుణుల కమిటీ సభ్యులు శ్రీ యల్లాల వెంకటరామిరెడ్డి తన మాతృమూర్తి వర్దంతి సందర్భంగా నెల్లూరు జిల్లా వింజమూరులోని MPDO కార్యాలయ ఆవరణలో గల  దివ్యాంగుల పాఠశాల ‘భవిత’కు శీతల నీటి యంత్రాన్ని తమ కుటుంబ సభ్యులతో కలిసి అందించారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దివ్యాంగుల జాతీయ నిధి పర్యవేక్షక కమిటీ సభ్యులు శ్రీ వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ భారతీయ జీవన విధానంలో జన్మదిన వేడుకలు, వివాహ వార్షికోత్సవ వేడుకలు, ప్రమోషన్లు, పెద్దల వర్ధంతి కార్యక్రమాలు అని ఎన్నో జరుపుకుంటామని అటువంటి సందర్భాలను సేవా కార్యక్రమాలతో జరుపుకొని, ఆపదలో ఉన్న వారికి చేయూతనిచ్చి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత అలవర్చుకోవాలని  తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో MPDO శ్రీమతి స్వరూపారాణి మరియు MEO శ్రీ మాలకొండల రావులకు అందించారు. ఈ సందర్బంగా శ్రీ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ దివ్యాంగుల జాతీయ నిధి పర్యవేక్షక కమిటీ సభ్యులు శ్రీనివాసులు రెడ్డి సూచన మేరకు తాను ఈ కార్యక్రమానికి పూనుకున్నానని, వైకల్యంతో బాధపడుతున్న చిన్నపిల్లలకు ఈ విధంగా సహాయం చేయటం చాలా ఆనందముగా ఉన్నదని, మరేదైనా అవసరమున్నా తన దృష్టికి వస్తే సహాయం చేయగలనని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, రఘురామి రెడ్డి, కేశవులు రెడ్డి, ప్రసాద్ రెడ్డి, మల్లం కొండారెడ్డి, రవిశంకర్, బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.