NewsProgramms

ఉలవపాడులో హిందూ ధర్మ సమ్మేళనం

222views

ప్రకాశం జిల్లా  ఉలవపాడు నగరంలో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో హిందూ ధర్మ సమ్మేళనం జరిగింది. ఈ కార్యాక్రమంలో భాగంగా ముందుగా నగరంలో వందలాదిమందితో నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది.తదనంతరం జరిగిన సభా కార్యక్రమము స్వామి శ్రీ సత్యాత్మానంద స్వామివారి ఆశీఃప్రవచనంతో ప్రారంభమైనది. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క హిందువు ధర్మపరిరక్షణకు అంకితం కావలసిన అవసరాన్ని వివరించారు. ముఖ్య వక్తగా విచ్చేసిన ప్రాంత ధర్మజాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య వారి ప్రసంగములో రాష్ట్రంలో విస్తరిస్తున్న మత మార్పిడిల పట్ల హిందూసమాజం అప్రమత్తముగా ఉండవలసిన అవసరం ఉన్నదని, హిందూ సంసృతిని విచ్చిన్నం చేసే కుట్రలను కలసికట్టుగా ఎదుర్కోవల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇంకా ఈ  కార్యాక్రమంలో ముఖ్య అతిధులుగా శ్రీ చిట్టూరి సూర్యనారాయణ, శ్రీ పూరి శ్రీనివాసులు, ధర్మజాగరణ ప్రాంత సంయోజకులు శ్రీ వేముల సుబ్బారావు, విభాగ్ ధర్మజాగరణ ప్రముఖ్ శ్రీ శ్రీనివాసరావు, జిల్లా ధర్మజాగరణ ప్రముఖ్ శ్రీ బలరాం, ఖండ ప్రముఖ్ శ్రీ శ్రీనివాస్, మండల ప్రముఖ్ శ్రీ సీతారామయ్య పాల్గొన్నారు. దాదాపు ఎనిమిది వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.