News

బ్రిటన్ పార్లమెంటులో భగవద్గీతపై ప్రమాణం

803views

బ్రిటన్ పార్లమెంటులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే ఎన్నికలు జరగ్గా ఆ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులు హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన భారత సంతతి ఎంపీలు హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం. సభ్యులు తమకు నచ్చిన పవిత్ర గ్రంథంపై ప్రమాణం చేసే వెసులుబాటు బ్రిటన్ లో ఉండడంతో 15 మంది భారతీయులు భగవద్గీతపై ప్రమాణం చేశారు.

ఇది బ్రిటన్ పార్లమెంటులో మైనార్టీలకు పెరుగుతున్న ప్రాధాన్యతకు సూచిక అని నెటిజన్లు చెబుతూ ఉన్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి అల్లుడు రిషి సనక్ ప్రమాణం చేసే సమయంలో భగవద్గీతను చేతిలో పట్టుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఏకంగా 65 మంది శ్వేతజాతీయేతరులు విజయాన్ని సాధించారు. బ్రిటన్ చరిత్రలోనే ఇది తిరుగులేని అధ్యాయంగా చెప్పుకోవచ్చు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.