
తిరుపతిలో జరిగిన భారతీయ మజ్దూర్ సంఘ్-బీఎంఎస్ 70వ వార్షికోత్సవం ముగింపు సభలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమం కోసం బీఎంఎస్ చేసిన సేవలు మరిచిపోలేనివన్నారు. ఇతర కార్మిక సంఘాలకంటే భిన్నంగా బీఎంఎస్ కార్మికుల సంక్షేమంతోపాటు దేశం కోసం పనిచేస్తోందని తెలిపారు.

బీఎంఎస్ మూల సిద్ధాంతమే స్వదేశీ, స్వావలంభన, స్వాభిమానం అని కార్మికులు జాతీయ భావంతో పనిచేసేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వ్యక్తి కాదు దేశం.. జాతీ ముఖ్యం అని కార్మికుల్లో జాతీయభావాన్ని నింపుతోందని బీఎంఎస్ దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతూ ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద కార్మిక సంఘంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వారికి ఉపాధి కల్పించడానికి స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తోంద తెలిపారు. మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, మేడిన్ ఇండియా ఇవన్నీ ఈ కోవలో చేపట్టిన కార్యక్రమాలేని మంత్రి వివరించారు.





