News

శ్రీకృష్ణుడే మొదటి రాయబారి: సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

269views

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం, శ్రీ బాంకే బిహారీ టెంపుల్‌ ట్రస్ట్ వివాదంలో సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శ్రీకృష్ణుడే మొదటి రాయబారి అని.. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలంటూ ఇరుపక్షాలకు సూచించింది. ఇందుకోసం ఒక కమిటీని ప్రతిపాదించింది.

ఆలయ నిధుల నుంచి రూ.500 కోట్లతో కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తూ ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీనిని సవాల్‌ చేస్తూ కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణ సందర్భంగా శ్రీకృష్ణుడి రాయబారం గురించి సర్వోన్నత న్యాయస్థానం ప్రస్తావించింది. ఆర్డినెన్స్‌ను ఆమోదించడంలో తొందర ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీని రాజ్యాంగబద్ధతను పరిశీలించాలని అలహాబాద్‌ హైకోర్టును ఆదేశించింది.