
యూపీ వేదికగా అక్రమ మత మార్పిడి చంగూర్ బాబా కేసు మరిచిపోక ముందే మరో మత మార్పడి కేసు బట్టబయలైంది.సిద్ధార్ధ నగర్ జిల్లా ఇత్వాలోని అల్ ఫరూఖ్ ఇంటర్ కాలేజీకి సంబంధించిన మేనేజర్ మహ్మద్ షబ్బీర్ అహ్మద్ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ మత మార్పిడి కేసులో మేనేజర్ మహ్మద్ షబ్బీర్ అహ్మద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అఖండ ప్రతాప్ సింగ్ అనే హిందూ వ్యక్తిని బలవంతంగా ఇస్లాంలోకి మారమని పదే పదే ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. జలాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబాతో మేనేజర్ మహ్మద్ షబ్బీర్ కి సంబంధాలున్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే 2021 ప్రాంతంలో ఉద్యోగం కావాలంటూ ప్రతాప్ సింగ్ అల్ ఫరూఖ్ కాలేజీలో దరఖాస్తు చేసుకున్నాడు. తాము 15 వేల జీతం ఇస్తామని పేర్కొన్నారు. ప్రతాప్ సింగ్ చేరిన పది రోజుల్లోనే అల్ ఫరూఖ్ తన కార్యాలయానికి పిలిచి, విధి నిర్వహణలో భాగంగా 100 రూపాయల ఖాళీ అఫిడవిట్ లో సంతకం చేయించాడు.కానీ కొంత సమయం తర్వాత ప్రతాప్ సింగ్ ఆ అఫిడవిట్ ను చూసేరికి.. దిమ్మ తిరిగి పోయాడు. తానే స్వచ్ఛదంగా ఇస్లాం లోకి మారేందుకు ఇష్టపడ్డానని, అలాగే తన పేరును కూడా ఇష్టపూర్వకంగానే మార్చుకున్నట్లు ఆ అఫిడవిట్ లో వుంది. ‘‘నేను మత పరంగా హిందువునే. ఇస్లాం బోధనల ద్వారా బాగా ప్రభావితుడనయ్యాను. ఇస్లాం మత విశ్వాసాలను నమ్ముతున్నా. నా ఇష్టానుసారమే, ఒత్తిడి లేకుండా ఇస్లాంను స్వీకరిస్తున్నా. ఇక నుంచి నా పేరు ‘‘ఇమ్రాన్ ఖాన్’’ అని ఆ అఫిడవిట్ లో వుంది.
ఇదంతా తనకు తెలియకుండానే జరిగిపోయిందని ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. తాను ఇస్లాంను స్వీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. తాను ఇదే విషయాన్ని అల్ ఫరూఖ్ కి చెప్పినా… వినడం లేదని తనపై ఒత్తిడి తెస్తూనే వున్నాడని పేర్కొన్నాడు. అంతేకాకుండా తనకు 20 లక్షల నగదు, గుజరాత్ లో ఇల్లు, కారు కూడా ఇస్తానని పదే పదే ప్రలోభపెడుతున్నాడని వెల్లడించారు. ఈ విషయం అంతా తెలుసుకున్న తర్వాత తాను ఆ కాలేజీ కి రాజీనామా ఇచ్చేసి, వెళ్లిపోయానని ప్రతాప్ సింగ్ తెలిపారు. అయినా ఒత్తిళ్లు ఆగడం లేదని పేర్కొన్నారు.
మహ్మద్ షబ్బీర్ అహ్మద్ అల్ ఫరూఖ్ అనే విద్యా సంస్థ ముసుగులో ఇస్లామిక్ మత మార్పిడి రాకెట్ ను నిర్వహిస్తున్నాడని, గల్ఫ్ నుంచి నిధులు కూడా పొందుతున్నాడని ప్రతాప్ సింగ్ ప్రకటించారు.
చివరికి ప్రతాప్ సింగ్ ఏకంగా ముఖ్యమంత్రి యోగికే లేఖ రాశారు. దీనిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అసలు విషయం బయటికి రావడంతో పోలీసులు మహ్మద్ షబ్బీర్ ను అరెస్ట్ చేశారు. అయితే ఈ నిర్వాకాన్ని కాంగ్రెస్, భీం ఆర్మీ నాయకులు మద్దతిస్తున్నారు.





