
252views
విశాఖ నగరంలో మార్వాడీల కావడి యాత్రను వైభవంగా నిర్వహించారు. మాధవధార వద్ద ప్రారంభమైన యాత్ర కంచరపాలెం, తాడిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం మీదుగా బీచ్ రోడ్డుకు చేరింది. సుమారు 1000 మందికి పైగా భక్తులు ఇందులో పాల్గొన్నారు. శ్రావణమాసంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి చాలా ప్రత్యేకత ఉందని భక్తులు చెబుతున్నారు. ప్రకృతి పట్ల విశ్వాసం, కృతజ్ఞత తెలపడమే కాకుండా బలమైన కుటుంబ విలువలను పెంపొందించుకోవడమే ఈ యాత్ర లక్ష్యమని పేర్కొన్నారు.





