
భారత సాయుధ దళాల డ్రోన్ యుద్ధతంత్రాన్ని మరింత పదును తేల్చే ఆయుధాన్ని కర్నూలు జిల్లాలో పరీక్షించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఓ క్షిపణిని యూఏవీ లాంచ్‌డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ (యూఎల్‌పీజీఎం)-వీ3గా వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజి-ఎన్‌వోఏఆర్‌లో ఈ ప్రతిష్ఠాత్మక పరీక్ష జరిగింది.
ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫొటోను ఆయన పంచుకొన్నారు. డీఆర్‌డీవో, ఈ క్షిపణి అభివృద్ధి, తయారీలో భాగస్వాములైన ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్స్‌ను ఆయన అభినందించారు. సంక్లిష్టమైన టెక్నాలజీని అర్థం చేసుకోవడంతోపాటు.. ఉత్పత్తి చేయగలిగే సత్తా భారత్‌కు ఉందని ఈ పరీక్ష నిరూపించిందన్నారు.
ULPGM‑V3కి సంబంధించిన సాంకేతిక అంశాలను బహిర్గతం చేయలేదు. గతంలో డీఆర్‌డీవో-DRDO పత్రాలు, ఓపెన్ సోర్స్ సమాచారం ప్రకారం గతంలో పరీక్షించి ULPGM‑V2 ప్లాట్‌ఫామ్ పైనే దీనిని అభివృద్ధి చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలో డీఆర్‌డీవోకు చెందిన NOAR పరీక్ష కేంద్రాన్ని దీనికి ఎంచుకొన్నారు. గతంలో కూడా ఇక్కడ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ వ్యవస్థను పరీక్షించేందుకు ఇదే వేదికను వాడారు. ఈ ఆయుధం ఫిక్స్‌డ్‌వింగ్ మానవ రహిత విమానాలను కూల్చేందుకు వినియోగిస్తారు. ఇక్కడ జరుగుతున్న ప్రయోగాలతో భారత్ డ్రోన్ యుద్ధతంత్రంలో ముందంజ వేస్తోంది.
ఇందిర రికార్డును అధిగమించనున్న మోదీ
దాదాపు 2,200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ రేంజి డీఆర్‌డీవో అధీనంలోని ఎన్‌వోఏఆర్ అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్-EW రేంజి. దీనిని 2016-17లో ప్రారంభించారు. సాధారణంగా ఇండోర్ పరీక్షించే ఈడబ్ల్యూ ఆయుధాలు అందుబాటులోకి రావాలంటే.. ఏడాది నుంచి రెండేళ్లు పడుతుంది. కానీ, బాహ్య ప్రదేశాల్లో పరీక్షించేవి వేగంగానే దళాల్లోకి చేరే అవకాశం ఉంటుంది. ఇక్కడ పరీక్షించే ఆయుధాల్లో రాడార్లు, ట్రాన్స్‌మీటర్లు, యాంటెన్నాలు, సెన్సర్లు, కమ్యూనికేషన్ పరికరాలతోపాటు.. డైరెక్ట్ ఎనర్జీ (లేజర్) వెపన్స్ కూడా ఉంటున్నాయి.
ULPGM శ్రేణి ఆయుధాలను తపస్-బీహెచ్, ఆర్చర్ ఎన్‌జీ యూఏవీల కోసం అభివృద్ధి చేశారు. ఇది చాలా తక్కువ ధరతో ఉత్పత్తి చేయవచ్చు. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తాయి. అత్యంత సమీపం నుంచి జరిగే పోరాటాల్లో ఫైర్ అండ్ ఫర్‌గెట్ వ్యవస్థ ఆధారంగా దీనిని ప్రయోగించవచ్చు.





