
శ్రీకాకుళం జిల్లాలో మరోసారి ఉద్యోగాల సందడి ప్రారంభం కానుంది. జూలై 28న జరగబోయే జాబ్ మేళా మారనుంది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరియు నేషనల్ కెరీర్ సర్వీస్ (NCS) సంయుక్త ఆధ్వర్యంలో పాతపట్నం వద్ద మహేంద్ర డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో సోమవారం ఉదయం 9:30 గంటలకు ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా వందలాది మంది యువతకు ఉపాధి దొరకనుంది. రాష్ట్రంలోని పట్టణాలే కాదు, గ్రామీణ ప్రాంతాల యువతకు కూడా ఈ ఉద్యోగాల ద్వారా ఒక మార్గదర్శకం లభించనుంది.
దేశవ్యాప్తంగా పేరున్న అనేక ప్రముఖ సంస్థలు ఈ మేళాలో పాల్గొనబోతున్నాయి. మొత్తం 590కి పైగా ఖాళీలు భర్తీ చేయనుండగా, ఈ సంస్థల్లో Colgate, Toshiba, Deccan Fine Chemicals, Apollo Pharmacy, Paytm, Premier Energies, Navata Road Transport, Spandana Sphoorthy Finance, Chennai Garments వంటి కంపెనీలు ఉన్నాయి. ఉద్యోగ రోల్స్ పరంగా చూస్తే టెక్నీషియన్, ట్రైనీ కెమిస్ట్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, డ్రైవర్, ఫార్మసిస్ట్, రిటైల్ అసోసియేట్, ప్రొడక్షన్ హెల్పర్, లోన్ ఆఫీసర్, జూనియర్ టెక్నీషియన్ వంటి విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి.





