ArticlesNews

ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! – 1 వ భాగం

165views

దక్షిణ భారతదేశంలో భారతీయ నాగరికత, సంస్కృతీ సంప్రదాయాల ఆనవాళ్లు లేకుండా చేయడానికి తమిళనాడు కేంద్రంగా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోంది. ఈ కుట్రలో ద్రవిడవాదపు పెద్దలు, క్రైస్తవ మత ప్రచారకులు ఒక జుగుప్సాకరమైన బంధంతో పెనువేసుకు పోయారు. పురావస్తు తవ్వకాల్లో బయటపడిన అపురూపమైన మన సంపదను మనది కాకుండా చేయడానికి పీకల్లోతు ప్రయత్నాల్లో మునిగి ఉన్నారు. దానిని ఘనమైన భారతీయ నాగరికత కాలిగోటికి సైతం ఏ మాత్రం సరిపోని పాశ్చాత్య నాగరికతతో ముడిపెట్టే పనిలో ఉన్నారు. భారతీయ మూలాలకు క్రైస్తవం అనే అంటుకట్టే సాహసానికి పూను కుంటున్నారు. ఈ అపవిత్రమైన కార్యానికి పెట్టుబడి కోసమని పాశ్చాత్య దేశాల నుంచి మనదేశానికి నిధులు వరద వెల్లువెత్తుతోంది. సామాజిక సేవ ముసుగులో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అనేక ప్రభుత్వేతర సంస్థలు – ఎన్జీవోలు ఈ పాపకార్యానికి కాపుకాస్తు న్నాయి. నేర చరిత్రలో నిండా మునిగిన ఓ రెవరెండ్‌్‌ మన నాగరికతను లేకుండా చేయడానికి దేశవిదేశాల్లో తన పలుకుబడిని ఉపయోగించుకొని చేయాల్సిందంతా చేస్తున్నాడు. ఇంతటి దారుణానికి ఒడిగడు తున్న ఈ మూక కడకు తమిళనాడులో తవ్వకాల్లో బైటపడిన శిథిలాల అసలు కాలాన్ని మార్చి, వాటిని తమకు అనుకూలమైన కాలానికి చెందినవిగా నిరూపించడానికి కిందామీదా పడుతోంది.

తమిళనాడులోని కీళడి గ్రామంలో చేపట్టిన పురావస్తు తవ్వకాలు ఈ దారుణానికి కార్యక్షేత్రంగా మారింది. ఇదే విషయమై పేరొందిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్‌ హరిశంకర్‌ తన పరి శోధనా పత్రంలో పలు దిగ్భ్రాంతి కరమైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. తవ్వకాల పేరుతో సాగించిన అరాచకాలను తూర్పారపట్టారు. భారతీయ నాగరికతతో ముడిపడిన తమిళనాగరికత క్రైస్తవీకరణకు కుట్రలు పన్నుతున్న డీఎంకే ఎంపీ కనిమొళి, ఆయుధాల ఏజెంట్‌ రెవరెండ్‌ జస్పేర్‌ రాజ్‌ తవ్వకాలు జరిగిన చోటున అణువణువును సందర్శించారు. దీనికి అప్పట్లో తవ్వకాలకు నేతృత్వం వహించిన కె. అమర్‌నాథ్‌ రామకృష్ణ కారణమయ్యారు. ఆ ఇద్దరిని ఆయన తవ్వకాలు జరుగుతున్న చోటుకు స్వయంగా తీసుకొని వెళ్లారు. అయితే భారత పురావస్తు సర్వేక్షణ ‘ఆర్కియా లజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’ ఏఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ టీఎస్‌ సత్యమూర్తిని మాత్రం అక్కడకు రావడానికి అనుమతించ లేదు సరికదా తవ్వకాల్లో బైటపడిన వస్తువులను కనీసం చూడనైనా చూడనివ్వ లేదు.

ఇదిలా ఉంటే భారతీయ ఆత్మనిర్భర భారత్‌ పేరిట దేశీయ పరిజ్ఞానంతో స్వావ లంబన దిశగా ముందుకు సాగుతున్న మనదేశంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, పరికరాలతో కూడుకున్న ప్రయోగశాలలకు కొదవేముంది? అలాగని తవ్వితీసిన పురాతన వస్తువులను భారత్‌లో ప్రయోగశాలలకు పంపిస్తే వాటి అసలు కాలం బయటపడుతుంది. దాంతో ఇటుక మీద ఇటుక అన్నట్టుగా భారతీయ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, క్రైస్తవ మతానికి అండగా కట్టుకున్న కలల సౌధం కూలిపోతుంది. అందుకునే ఈ గడ్డమీదనే పుట్టి, ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేయాలని చూస్తున్న దుండుగుల ముఠా పురాతన వస్తువులను విదేశాల్లో ప్రయోగశాలలకు పంపించేలా చేయడంలో అక్కడ తనకున్న పలుకుబడిని విచ్చలవిడిగా వాడుకుంది. వాటి కాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంది. మనదేశ విద్యాసంస్థల్లో పురావస్తుశాస్త్రంలో పెద్ద పెద్ద చదువులు చదివి ప్రభుత్వంలో అత్యున్నత పదవులను పొందిన వారు మన నాగరికతపై ఇంటి దొంగలు అండగా పాశ్చాత్య నాగరికతా ప్రభువులు సాగిస్తున్న దండయాత్రకు దారి చూపించడం దేశ ద్రోహానికన్నా మించిన నేరం. అయినా సరే నిస్సిగ్గుగా, తల్లి పాలు తాగి రొమ్మును గుద్దుతున్నామనే కనీస స్పృహ లేకుండా పోయిన కొందరు అధికారులు ద్రవిడవాదపు పెత్తందార్లకు, మన దేశ చరిత్రకు మసిపూసి మారేడుకాయ చేసి అందులో ఇసుమంతైన భారతీయత లేకుండా చేసే తమిళనాట ఘనత వహించిన విశ్వవిద్యా లయాల్లో చరిత్రకారులకు, చర్చి ఫాదర్లకు దాసోహమన్నారు. రాత్రికి రాత్రే నివేదికలో రాతలు, అంకెలు మారిపో యాయి. పురావస్తు వస్తువుల కాలమాన పరిస్థితులూ మారిపో యాయి.

ఇంతటి నాగరికతా ఘోర విధ్వంసానికి పవిత్ర వైగై నదీ తీరంలో వెలసిన కీళడి గ్రామం కార్యక్షేత్రంగా మారింది. ఇంతకీ ఇంతటి దారుణానికి ఒడిగడుతున్నది మరెవరో కాదు. హిందీ భాష అంటే మంట, దశాబ్ద కాలానికిపైగా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంటే కడుపు మంటతో రగిలిపోతున్న డీఎంకే అధినేత స్టాలిన్‌ హయాంలోని తమిళనాడు సర్కారు. మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి, నేర చరిత్ర ఉన్న రెవరెండ్‌ జస్పెర్‌ రాజ్‌. వీరందరికి అదుపాజ్ఞల్లో పనిచేసే కొన్ని ఎన్జీవోలు. ప్రజల దృష్టిని డీఎంకే సర్కారు అవినీతి నుంచి, తీరని సమస్యల నుంచి మరల్చడానికి కీళడిలో తవ్వకాల వ్యవహారాన్ని ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మార్చుకోవడానికి ఈ ముఠా ప్రయత్నిస్తోంది. అలాగని మోదీ సర్కారు డీఎంకే రంగస్థలం పైన నడుస్తున్న నాటకం విషయంలో కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం అనుకుంటే పొరపాటు పడినట్టే. మన వారసత్వ సంపదకు అద్దం పట్టే పురాతన వస్తువుల పుట్టుకను వక్రీకరించిన వారి తలరాతలను మార్చే పనిలో కేంద్రం ఉంది. నివేదికల మీద నివేదికలు అడుగు తోంది. ఇవాళ కాకపోతే రేపైనా అసలు నిజం వెలుగులోకి రాకుండాఉండదు. అప్పుడిక ద్రవిడవాదాన్ని భుజాలకు ఎత్తుకొని, క్రైస్తవాన్ని చంకన పెట్టుకొని, పాశ్చాత్య పోకడలను ఊత కర్రగా చేసుకొని ప్రజల మీద పెత్తనం చేస్తూ భారతీయతను భూస్థాపితం చేయాలనుకునే స్టాలిన్‌ లాంటి రాజకీయ నాయకుల ఆట కట్టవుతుంది.