News

ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో 251 అడుగుల కాషాయ జెండాలు

NEW DELHI, INDIA APRIL 16: Chief Minister of Uttarakhand Pushkar Singh Dhami during the inauguration of three days Ayodhya Parv-2022' organized by Gandhi Smriti and Darshan Samiti on the occasion of Ayodhya Parv at Raj Ghat, on April 16, 2022 in New Delhi, India. Ayodhya Parv was started in 2019 with the aim of underlining the cultural and historical glory and religious importance of Ayodhya. (Photo by Sonu Mehta/Hindustan Times via Getty Images)
291views

251 అడుగుల ఎత్తైన కాషాయ జెండాలను రాష్ట్ర సరిహద్దుల ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు.

హరిద్వార్ లోని గంగా నదీ తీరాన ‘ధర్మ ధ్వజ్’ పేరుతో ఏర్పాటు చేయనున్న ఈ జెండాకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. ఇవి ప్రపంచంలోనే ఎత్తైన ఆధ్యాత్మిక జెండాలు కానున్నాయని పేర్కొన్నారు. హర్ కీ పౌరి నిర్వహణ సంస్థ శ్రీ గంగా సభ, జిల్లా పరిపాలన మరియు భారత నదీ మండలి సంయుక్త ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేస్తారు.

ఉత్తరాఖండ్ ‘దేవభూమి’ అని, ఒక వ్యక్తి రాష్ట్రంలోకి ప్రవేశించిన వెంటనే గొప్ప అనుభూతిని పొందేలా తాను దేవభూమిలోకి ప్రవేశిస్తున్నట్లు భావించేలా సరిహద్దుల్లో భారీ ధర్మ ధ్వజాలను ఏర్పాటు చేస్తామని, “ధర్మ ధ్వజ్‌ను ప్రతిష్టించడం వెనుక ఉద్దేశ్యం ఇదేనని ముఖ్యమంత్రి చెప్పారు.

హరిద్వార్‌లో మొదటి జెండాను ఏర్పాటు చేస్తామని, ‘ధర్మ ధ్వజ’ 251 అడుగుల ఎత్తు ఉంటుందని, ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఆధ్యాత్మిక జెండా అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు.