News

మథుర కృష్ణాలయం వ్యాజ్యంలో అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశం

293views

ఉత్తరప్రదేశ్ లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంలో హిందూ పక్షం ఇంతవరకు దాఖలు చేసిన 18 దావాలలో 17వ నంబరు దావాయే మిగిలిన వాటికీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పరిగణించాలని కోరిన దరఖాస్తును అలహాబాద్ హైకోర్టు అనుమతించింది. మిగిలిన దావాలపై స్టే ఇచ్చి, 17వ దావాపై కోర్టు ఇచ్చే తీర్పును అందరికీ వర్తింపజేయాలని ముస్లింల తరపు న్యాయవాది తస్లిమా నసీం కోరారు. తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 22కు వాయిదా వేసింది. మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ మథురలో కృష్ణుడి ఆలయాన్ని కూలగొట్టి షాహీ ఈద్గా మసీదు నిర్మించారు. ఈ మసీదును తొలగించి కృష్ణ మందిర నిర్మాణానికి అనుమతి వ్వాలని హిందూ పక్షం హైకోర్టును కోరుతోంది.