
239views
రాష్ట్రంలో అక్రమణకు గురైన దేవాదాయశాఖ భూములపై చర్యలు తీసుకుంటామని ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో విజయమార్తాండేశ్వరస్వామి దేవస్థానం గదుల నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు ఉగ్రనరసింహారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దేవాదాయ శాఖకు చెందిన ఒక లక్ష 8 వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని తెలిపారు. అక్రమిత దేవాలయ భూములపై జిల్లా కలెక్టర్లు చట్టపరంగా వాటిని స్వాధీనం చేసుకోవాలని మంత్రి సూచించారు. అన్యా క్రాంతమైన దేవాలయ భూములను జిల్లా కలెక్టర్లు, జేసీలు అవసరమైతే కోర్టుల్లో పిటిషన్లు వేసి చట్టపరంగా వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. కనిగిరి విజయమార్తాండేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూములు ఇతర ప్రాంతాల్లో ఉన్నా యని, వాటినీ స్వాధీనం చేసుకుంటామన్నారు.





