NewsProgramms

కోలాహలంగా కౌశల్-2019 అభినందన కార్యక్రమం

637views

నెల్లూరులో కౌశల్-2019 ఆర్గనైజింగ్ జట్టు సమావేశం జరిగింది, ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ అన్వేషణ పరీక్ష సమర్ధవంతంగా నిర్వహించటంలో కృషి చేసిన ఉపాద్యాయుల అభినందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RSS విభాగ్ ప్రచారక్ శ్రీ లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. స్వదేశీ శాస్త్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళుతున్న విజ్ఞాన భారతిని ఆయన అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించేందుకు  టీచర్స్ అందరికి జ్యూట్ సంచులను అందజేశారు. కౌశల్ జిల్లా పొటీలలో ప్రధమ,ద్వితీయ స్థానాలు పొందిన పాఠశాలలకు ఈ నెల 14 న విజయవాడలోని SRK ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని, గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొంటారని, వారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం ఉంటుందని కౌశల్ జిల్లా సమన్వయ కర్త శ్రీ RRS ప్రసాద్ తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షులు శ్రీ ఆచార్య ఆదిత్య పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న ఆరెస్సెస్ విభాగ్ ప్రచారక్ శ్రీ లక్ష్మీనారాయణ

ఉపాధ్యాయ మిత్రులతో ఆచార్య ఆదిత్య, శ్రీ లక్ష్మినారాయణ

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.