ArticlesNews

సోషలిస్ట్, సెక్యులర్ పదాలకు ఫాసిస్ట్ వక్రీకరణ

284views

అత్యవసర పరిస్థితి సమయంలో, రాజ్యాంగ పీఠికను సోషలిస్ట్ మరియు లౌకిక అనే రెండు పదాలను జోడించి సవరించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ మాననీయ సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే గారు ఇటీవల లౌకిక మరియు సోషలిస్టు పదాల గురించి పునరాలోచించాలని సూచించారు.

కానీ ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాద్ధాంతం చేస్తూ అబద్దపు కథనాన్ని వండి వార్చడంలో తీరిక లేకుండా నిమగ్నమైయ్యాయి.

అసలు రాజ్యాంగంలో చేర్చబడిన లౌకిక మరియు సోషలిస్టు పదాల గురించి వివరంగా తెలుసుకుందాం

ఎమర్జెన్సీ సమయంలో, భారత రాజ్యాంగ పీఠికలో రెండు పదాలు చేర్చబడ్డాయి. మనందరికీ లౌకికవాదం మరియు సోషలిజం గురించి తెలుసు. అవి తొలుత రాజ్యాంగ పీఠికలో లేవు. ప్రవేశికలో లేవు
ఆ రెండు పదాలను జోడించారు. ప్రవేశిక ఒక శాశ్వత రూపంలో ఉంది. ఏ మౌళిక సిద్ధాంతాలను అనుసరిస్తూ సోషలిజయం అనే భావజాలం భారతదేశానికి వర్తిస్తుంది?

సెక్యులరిజం అనే శబ్దం రాజ్యాంగంలో లేదు కానీ దానిని ప్రవేశికలో జోడించారు. లౌకికవాదం పరిగణనలోకి తీసుకోబడింది.

బాబా సాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రూపొందించారో దాని ప్రవేశికలో ఈ రెండు పదాలు లేవు. రాజ్యాంగ సభలో చర్చ సందర్భంగా, లౌకిక, సోషలిస్ట్ వంటి పదాలు కూడా చర్చించబడ్డాయి.

రాజ్యాంగ సభ సభ్యులు ప్రొఫెసర్ కే.టి. షా 1948 నవంబరు 15న భారత రాజ్యాంగ ముసాయిదాకు సవరణను ప్రతిపాదించారు. ఇందులో సెక్యులర్, సోషలిస్ట్ పదాలను చేర్చాలని ప్రతిపాదించారు. కానీ, ఈ ప్రతిపాదనను డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.ఇక్కడ సమస్య లౌకిక మరియు సోషలిస్టు అనే పదాల గురించి కాదు. ఈ పదాలను రాజ్యాంగంలో చేర్చిన విధానం ఫాసిస్ట్, నిరంకుశ మరియు అప్రజాస్వామిక ప్రభుత్వం ద్వారా చేయబడింది.

1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో సోషలిస్ట్ మరియు లౌకిక అనే పదాలు చేర్చబడ్డాయి. ఇవి పలు ప్రముఖ కారణాల వల్ల అన్యాయమైనవి మరియు చట్టవిరుద్ధమైనవి.

1976లో 42వ రాజ్యాంగ సవరణ సోషలిస్ట్ మరియు లౌకిక పదాలు జోడించబడ్డాయి. ఇవి రెండు ప్రధాన కారణాల వల్ల సరైనవి కావు మరియు చట్ట విరుద్ధంరాజ్యాంగాన్ని సవరించడంలో చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన సరైన ప్రక్రియను పాటించలేదు. వీటిని రాజ్యాంగంలో ఫాసిస్ట్, నిరంకుశ మరియు బలవంతపు పద్ధతిలో చేర్చారు.

1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్ట్ మరియు లౌకిక పదాలు జోడించబడ్డాయి. ఇవి రెండు ప్రధాన కారణాల వల్ల సరైనవి కావు మరియు చట్ట విరుద్ధం. రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో ఈ రెండు పదాలను రాజ్యాంగ సభ ఏకగ్రీవంగా తిరస్కరించింది మరియు ప్రజాస్వామ్యాన్ని మరియు రాజ్యాంగాన్నీ బందీగా చేయడం ద్వారా వాటిని రాజ్యాంగంలో తిరిగి చేర్చారు.

లౌకిక మరియు సోషలిస్ట్ అనే పదాలకు సంబంధించి, రాజ్యాంగం ద్వారా రాబోయే తరంపై ఎటువంటి భావజాలాన్ని రుద్దకూడదని డాక్టర్ అంబేద్కర్ విశ్వసించారు.

నిత్యం రాజ్యాంగం నకలును చేతుల్లో పట్టుకొని తిరుగుతున్నవారు, 1948 నవంబరు 15న రాజ్యాంగ సభలో చర్చ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ ఏం చెప్పారో నేడు తెలుసుకోవాలి. అది ప్రచురించబడింది.

రాజ్యాంగ సభ చర్చలోని ఏడవ సంపుటిలోని నాలుగు వందల రెండవ పేజీలో, డాక్టర్ అంబేద్కర్ ఆ రోజు ఇలా అన్నారు. “రాజ్యాంగంలో ఈ విషయాలను ముందుగానే నిర్ణయించడం సరైనది కాదు, ఎందుకంటే అలా చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడమే. సమాజ నిర్మాణం ఎలా ఉంటుందో రాజ్యాంగంలో ముందుగానే నిర్ణయించుకుంటే, ప్రజల స్వేచ్ఛను హరించివేస్తాం. అప్పుడు ప్రజలు ఎలాంటి సామాజిక వ్యవస్థలో జీవించాలనుకుంటున్నారో నిర్ణయించుకునే అవకాశం ఉండదని తెలిపారు. నేటి ప్రజలు సోషలిజం మంచిదని, పెట్టుబడిదారీ విధానం సరైనది కాదని నమ్మే అవకాశం ఉంది, కానీ భవిష్యత్తులో ఆలోచనాత్మక వ్యక్తులు నేటి సోషలిస్ట్ వ్యవస్థ కంటే మెరుగైన మరొక రకమైన సామాజిక వ్యవస్థను సృష్టించే అవకాశం కూడా ఉందని చెప్పారు. కాబట్టి, రాజ్యాంగంలో ఒకే సామాజిక వ్యవస్థను బలవంతంగా ప్రవేశపెట్టడం సరైనది కాదు. ప్రజలు తాము ఎలాంటి వ్యవస్థలో జీవించాలనుకుంటున్నారో స్వయంగా నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉండాలి. అందుకే నేను ఈ సవరణను వ్యతిరేకిస్తున్నాను” అని డా.బి.ఆర్.అంబేద్కర్ పేర్కొన్నారు.

బాబా సాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకించిన రాజ్యాంగ మార్పులు, అత్యవసర పరిస్థితి సమయంలో, మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ రాజ్యాంగాన్ని సవరించి, లౌకిక, సోషలిస్ట్ వంటి పదాలను జోడించారు, అది కూడా ప్రతిపక్షంలోని చాలా మంది పెద్ద నాయకులు జైలులో ఉన్నప్పుడు.

రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ, దానిని అపహాస్యం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దేశంలో ఎమర్జెన్సీని విధించడం ద్వారా కాంగ్రెస్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది.

అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూల్చివేత తర్వాత, కేంద్రంలోని నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌కు చెందిన కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన శాంత కుమార్ ప్రభుత్వాన్ని, రాజస్థాన్‌కు చెందిన భైరాన్ సింగ్ షెకావత్ ప్రభుత్వాన్ని, మధ్యప్రదేశ్‌కు చెందిన లాల్ పట్వా ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది.

ఈ చర్య రాజ్యాంగబద్ధమైనదా? రాజ్యాంగాన్ని అవమానించడంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అయినా కూడా ప్రజలను తప్పుదారి పట్టించడం ద్వారా రాజకీయ లబ్ది పొందే ప్రయత్నాలను విరమించదు.