
258views
శ్రీశైలంలో బాంబులు, బుల్లెట్ల కలకలం రేగింది. ఆలయం సమీపంలోని వాసవీ సత్రం ఎదురుగా ఉన్న డివైడర్‌పై వీటిని గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం సత్రం ముందునుంచి వెళ్తున్న కొందరు స్థానికులు డివైడర్ వద్ద ఉన్న సంచిని గమనించారు. అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీశైలం పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది సంచిని తనిఖీ చేసి అందులో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. సంచిలో 9 పెద్దవి, 4 చిన్న బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో 4 బాంబులను కూడా గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించారు. సంచిలో బుల్లెట్లు ఎవరు వదిలి వళ్లి ఉంటారనే కోణంలో శ్రీశైలం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీశైల క్షేత్రంలో దేవస్థానానికి చెందిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.





