
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని రాహుల్ విహార్ బస్తీలో ఇటీవల, ప్రజలను ప్రలోభపెట్టి మతం మార్చేందుకు యత్నించిన ఒక క్రైస్తవ పాస్టర్ మరియు అతని సహచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రతి ఆదివారం, ఇక్కడ ఒక ఇంట్లో రహస్యంగా ప్రార్థన సమావేశాలు నిర్వహించేవారు. ఈ సమయంలో, హిందువులకు వివిధ ఆకర్షణీయమైన ప్రలోభాలను చూపించి తద్వారా క్రైస్తవ మతంలోకి మార్చేవారు.
పోలీసుల వివరాల ప్రకారం కేరళకు చెందిన పాస్టర్ వినోద్ సాహిబాబాద్‌లో నివసిస్తున్నారు. అతను అప్పటికే మతం మారిన క్రైస్తవుడైన ప్రేమ్‌చంద్ జాతవ్ ఇంటికి ప్రజలను పిలిపించి, క్రైస్తవ మత సమావేశాలను నిర్వహించేవాడు.
స్థానికుడైన ప్రబల్ గుప్తా ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా, పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి వారిద్దరినీ అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్ అక్రమ మతమార్పిడి ప్రతీకార చట్టం కింద వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ ప్రియశ్రీ పాల్ తెలిపారు.





