
రాజమహేంద్రవరం శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో రామన్ ఫౌండేషన్, శ్రీ సాయిబాబా నాట్యమండలి విజయవాడ వారిచే ఆదివారం ప్రదర్శించిన ‘జయహెూ ఛత్రపతి శివాజీ’ చారిత్రక నాటకం అద్యంతం ఆకట్టుకుంది. శివాజీ పట్టాభిషిక్తుడై 350 ఏళ్లయిన సందర్భంగా డా. పి.వి.ఎన్. కృష్ణ రచన, దర్శకత్వంలో ప్రదర్శించిన ఈ నాటకం అకాడమీ ఆఫ్ సి.బి.ఆర్, స్పోర్ట్స్, అండ్ ఎడ్యుకేషన్ అధినేత చలసాని బలరామయ్య సహకారంతో 60 మంది కళాకారులతో ప్రదర్శించిన ఈ నాటకం ఎల్డి స్క్రీన్స్ వంటి అధునాతన హంగులతో సాగింది. ఎక్కడా విసుగు విరామం లేకుండా దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ నాటకాన్ని సంస్కార భారతి ఆధ్వర్యంలో ప్రదర్శించారు. ముందు స్వదేశం, తర్వాత స్వధర్మం, ఆతరవాతే కుటుంబం అంటూ శివాజీకి సమర్థ రామదాను చేసిన హితబోధ లాంటి ఘట్టాలకు హర్షధ్వానాలు మిన్నంటాయి. భర్త చనిపోతే భార్య కూడా సహగమనం చేయాలన్న ఉద్దేశ్యంతో సతీ సహగమనానికి వెళ్తున్న తల్లి జిజియా బాయిని నిలువరించి, ఉత్తములు ఏది ఆచరిస్తే అదే అందరూ ఆచరిస్తారని శివాజీ చెబుతూ, తన రాజ్యంలో సతీ సహగమనాన్ని నిషేధిస్తున్నట్లు శివాజీ ప్రకటించిన ఘట్టం ఆకట్టుకుంది.
సింహం సింహం పోరాడుకుని చనిపోతే, అడవి… గుంటనక్కల పాలవుతుంది’ వంటి డైలాగులు ఆకట్టుకున్నాయి. శివాజీగా సాయి శంకర్, అఫ్టల్ ఖాన్ గా అనంత్ శ్రీకర్, బెరంగ జేబుగా నర్సయ్య, జిజియా బాయి గా రూపసి తదితరులు తమ నటనతో రక్తికట్టించారు. మొఘలు రాజుల కుటిల యత్నాలను ఎదుర్కొంటూ, మరోపక్క స్వదేశీ రాజులను సమన్వయ పరచుకుని హిందూ రాజ్య స్థాపనకు క్విజ్ ఏవిధంగా ముందుకు సాగాడో ఈ నాటకం ద్వారా వివరించారు. శివాజీ పట్టాభిషిక్తుడయ్యే ఘటనతో నాటకం ముగించారు.
తొలుత ఎమ్మెల్సీ సోము వీర్రాజు జ్యోతి ప్రకాశనం చేసి మాట్లాడుతూ జాతిని బలహీనుల్ని చేసే విధానానికి అడ్డుకట్ట వేయాలన్నారు. అందుకు శివాజీ లాంటి నాటక ప్రదర్శనలు అవసరమన్నారు. శివాజి గురించి, మహా మహోపాధ్యాయ దోర్బల ప్రభాకర శర్మ వివరించారు. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ముఖ్య అతిధిగా హాజర య్యారు. టీఎన్ వి రమణమూర్తి, తాడోజు హరి, కాకీ విశ్వనాథం, డిహెచ్ వీ శాస్త్రి తదితరులు పర్యవేక్షించారు. నాటకం అనం తరం కళాకారులను, సాంకేతిక నిపుణులను దర్శక రచయిత, సమర్థ రామదాసు పాత్రధారి డా పిబిఎస్ కృష్ణ పరిచయం చేసారు. అలాగే ఒక పాటకు అనుగుణంగా ఎనిమిది మందిని నాట్యానికి సమకూర్చిన నాట్యాచార్య పసుమర్తి శ్రీనివాస శర్మను కూడా పరిచయం చేసి అభినందించారు. ఈ నాటకాన్ని తెనాలి, జగ్గయ్య పేటలలో ప్రదర్శించినపుడు చూడలేకపోయి నప్పటికి ఇక్కడ వీక్షించడం చాలా తృప్తిగా ఉందని చలసాని బలరామ య్య పేర్కొంటూ, హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రదర్శించాలని, అందుకు సహకరిస్తానని సూచించారు.
ఆచార్య దోర్బల ప్రభాకర శర్మ మాట్లాడుతూ శీను తర్వాత శ్రీను ప్రదర్శిస్తూ, ఎక్కడా విసుగు విరామం లేకుండా నాటకాన్ని రక్తికట్టించి, ఇంతమందిని చివరివరకు కూర్చోబెట్టడం అభినందనీయమని కొనియాడారు. అడిటర్ వేదాంతం రాహుల్, అల్లు బాబి,డి నీలకంఠరావు, జిల్లా బిజెపి అధ్యక్షుడు ఫిక్కీ నాగేంద్ర, నాట్యాచార్య సప్పా దుర్గాప్రసాద్, డా టివి నారాయణరావు దంపతులు, బివి సుబ్రహ్మణ్యం, వాడ్రేవు మల్లవరాజు, డివి హనుమంతరావు దంపతులు, అజ్జరపు హరిబాబు, కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి పరిమి రాధాకృష్ణ సర్సిపల్లి హారిక, కొత్తపల్లి గీత, కురగంటి సతీష్, వడాల నాగరాజు, యానావు ఏను, తదితరులు పాల్గొన్నారు.





