News

దుర్గమ్మ సన్నిధిలో “శక్తి సేవ”

268views

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులకు నిస్వార్థంగా ఉచిత సేవలు అందించే సేవకులకు, భక్త బృందాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. దేవస్థానంలో సేవలు అందించే సేవా బృందాలతో ఈవో శీనా నాయక్ మహా మండపం ఆరో అంతస్తులో సమావేశమయ్యారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు సేవ చేయడం అమ్మవా రికి సేవ చేయడంతో సమానమని పేర్కొన్నారు. సేవకుల రిజిస్ట్రేషన్ నిమిత్తం ఆన్లైన్ అప్లికేషన్ సిద్ధమైందని, ఆఫ్లైన్ లో కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. బృందాలుగా వచ్చే వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు శీనానాయక్ పేర్కొన్నారు. తిరుమలలో శ్రీవారి సేవగా ప్రాచుర్యం పొందగా, దుర్గమ్మ సన్నిధిలో శక్తి సేవగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. సేవకులకు తిరుమల తరహాలో తాత్కాలిక గుర్తింపు కార్డు, వసతి, అన్నప్రసాదం, లాకర్ సదుపాయాలను కల్పిస్తామని పేర్కొన్నారు.