
253views
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో బక్రీద్ సందర్భంగా పెద్ద సంఖ్యలో గోవులను అక్రమంగా రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేయాలని రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే పోలీసులను ఆదేశించారు. పోలీసుల కధనం ప్రకారం, పాత కామ్తార్ ప్రాంతంలో పోలీసుల తనిఖీల భాగంగా 238 ఆవులను రక్షించారు.
ఈ కేసులో, స్టోర్ హౌస్ యజమానులు నబ్బూ వజీర్ ఖురేషి, సాజిద్ కుతుబ్ ఖురేషి, జుబైర్ అల్తాబ్ ఖురేషి, ఫయాజ్ సత్తార్ ఖురేషి, ఆసిఫ్ ఖురేషిలతో పాటు వారి సహాయకులపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.





