
పాస్టర్లు, ఇమాంలు, మౌజన్లకు ఏ నిబంధన మేరకు పారితోషికం ఇవ్వనున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై తగిన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్, మరియు వక్ఫ్ బోర్డు సీఈఓలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పాస్టర్ లు, ఇమాంలు, మౌజన్లకు పారితోషికం ఇచ్చేందుకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పడాన్ని సవాల్ చేస్తూ రామ బొట్ల శ్రీనివాస్ సుధీష్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ జి శ్యామ్ ప్రసాద్ లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





