News

‘అల్లా పాకిస్తాన్ సైనికులను క్షేమంగా చూడాలి’ : ముస్లిం ఉపాధ్యాయురాలు

284views

మధ్యప్రదేశ్లోని సెహెూర్ జిల్లాలో షహనాజ్ పర్వాన్ అనే ఒక ఉపాధ్యాయురాలిని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం నుంచి ఉద్వాసన చెప్పింది. ఆమె ముస్లిం, అక్కడ అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ కాబట్టి ఆమెను ఉద్యోగం నుంచి తొలగించి ఉండాలని మన నాటు ఉదారవాదుల మాదిరిగా ఆలోచించవద్దు. ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు ‘అల్లా పాకిస్తాన్ సైనికులను క్షేమంగా చూడాలి’ అని ఒక సందేశం సామాజిక మాధ్యమాలలో పెట్టిందీమె. సెహోర్లోని మేహత్వాడా అనే చోట ప్రాథమికోన్నత పాఠశాలలో ఈమె ఉపాధ్యాయురాలు. ఈమె పెట్టిన వీడియో సామాజిక మాధ్యమాలలో కనిపించగానే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఉద్యోగం నుంచి తొలగించినట్టు లేఖ పంపింది. భారతీయ న్యాయ శాస్త్రంలోని 163 నిబంధన కింద ఈ చర్య తీసుకున్నారు.