
297views
వైయస్సార్ కడప జిల్లా జ్యోతి క్షేత్రంలోని కాశినాయన ఆలయానికి శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్సీ డీసీ.గోవిందరెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని హైదరాబాద్‌లో ఆయన కలిసి సమస్య విన్నవించారు. ఇటీవల జ్యోతి క్షేత్రంలో భవనాలను అటవీ అధికారులు కూల్చి వేశారని, ఆలయ నిర్మాణం అర్థాంతరంగా నిలిచిపోయిందని విన్నవించారు. ఇటీవల చేసిన విజ్ఞప్తులు, ప్రయత్నాలకు కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. కాశినాయనకు కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో లక్షలాది కాశినాయక భక్తులున్నారని, కూల్చివేతలపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానన్నారు. జ్యోతిక్షేత్రం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. ఇక్కడ కొలువైన శ్రీఅవధూత కాశినాయనస్వామి మహిమాన్వితుడిగా ప్రసిద్ధి చెందారు.





