News

ఛార్ ధామ్ యాత్రకు ఈ వస్తువులు తీసుకెళ్లవద్దు..

201views

కేదార్‌నాథ్ ధామ్‌కు తీర్థయాత్రకు వెళ్ళే పర్యాటకులకు అక్కడ అధికారులు కొన్ని సూచనలు చేశారు. పర్యాటకులకు ఈ తీర్ధ యాత్ర చేసే సమయంలో కొన్ని వస్తువులను తీసుకెళ్లడం నిషేధించబడింది. వీటిలో మాంసాహారం, ప్లాస్టిక్, మద్యం, డ్రోన్లు ఉన్నాయి. మీ ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలంటే కొన్ని వస్తువులను తీసుకుని వెళ్ళవద్దు. అనవసరమైన సామాన్లు తీసుకుని వెళ్ళితే ఈ చార్ ధామ్ యాత్రలో సమస్యలు కలుగవచ్చు.

ఛార్ ధామ్ యాత్ర నేపధ్యంలో భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. మరోవైపు కేదార్‌నాథ్ ధామ్‌ యాత్రకు కొంతమంది ఇంకా బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. కేదార్‌నాథ్‌కు వెళ్లేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ యాత్ర చేసే సమయంలో పొరపాటున కొన్ని వస్తువులను తీసుకుని వెళ్తే.. ఎటువంటి పుణ్యం లభించదు. సరికదా మీరు కేదార్ నాథుడిని దర్శనం చేసుకొకుండానే తిరిగి రావాల్సి ఉంటుంది. దీంతో మీ ఛార్ ధామ్ యాత్ర అసంపూర్ణంగా మిగిలి పోతుంది.

మాంసం, చేపలు, గుడ్లు కేదార్‌నాథ్ యాత్ర ఒక ఆధ్యాత్మిక తీర్థయాత్ర. కనుక మతపరమైన దృక్కోణంలో మాంసం, చేపలు, గుడ్ల వంటివి ఈ యాత్రను చేసే సమయంలో తీసుకెళ్లడం సముచితం కాదు. హిందూ మతంలో మతపరమైన ప్రదేశాలలో ఈ వస్తువులు నిషేధించబడ్డాయి.

ప్లాస్టిక్, పాలిథిన్ నిషేధం కేదార్‌నాథ్ ఆలయం ప్రకృతి సౌందర్యానికి నిలయం. సమీపంలో మందాకిని నది, వాసుకి సరస్సు, చోర్బారి సరస్సు, గౌరీకుండ్ ఉన్నాయి. చుట్టుపక్కల హిమాలయ అందాలు ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని అందిస్తాయి. ఈ అందాన్ని కాపాడుకోవడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్లాస్టిక్, పాలిథిన్‌ను నిషేధించింది. కనుక ప్లాస్టిక్, పాలిథిన్ వస్తువులను తీసుకెళ్లవద్దు.