
271views
తిరుపతి జిల్లా వెంకటగిరిలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు.ఈ హనుమాన్ శోభాయాత్ర అశేష జన సందోహం మధ్య ఘనంగా జరిగింది.వెంకటగిరి విశ్వోదయ కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర ఆర్టీసీ బస్టాండ్ కాశీపేట, పోలేరమ్మ ఆర్చ్ పాత బస్టాండ్ మీదుగా శివాలయం వరకు అశేష జన సందోహం మధ్య హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు వడ్లమూడి భాస్కరరావు మాట్లాడుతూ హనుమంతుని పూజించడం అంటేనే శక్తిని ఉత్పాదించడం. పెహల్గాం దాడిలో మతం ఏది అని తెలుసుకుని మరీ దుర్మార్గానికి ఒడిగట్టిన దుర్మార్గపు పరిస్థితి నేడు భారతదేశంలో నెలకొనిదని చెప్పారు. హిందువులందరూ దేశంలోనే ప్రజలందరూ ఐక్యంగా మెలగాలన్నదే హనుమాన్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.





