
193views
దేశ రాజధాని దిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న మరో దౌత్య అధికారి గూఢచర్య నేరారోపణపై దేశ బహిష్కరణకు గురయ్యారు. గూఢచర్యానికి పాల్పడుతున్న ఆ అధికారిని 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాల్సిందిగా భారత ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి ఘటన జరగడం వారం వ్యవధిలో ఇది రెండోసారి. పాకిస్థాన్ హైకమిషన్‌కు చెందిన ఆ అధికారిని విదేశీ వ్యవహారాల శాఖ ‘‘అవాంఛిత వ్యక్తి’’గా ప్రకటించింది.
భారత విమానాలు మరో నెలరోజుల పాటు తమ గగనతలంలో ప్రయాణించకుండా పాకిస్థాన్ నిషేధాజ్ఞలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై గురువారంలోపు పాక్ అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు ఆ దేశ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి.





