
203views
పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ అనంతరం మనదేశంపై దాడి చేయడానికి పాక్‌కు తుర్కియే డ్రోన్ల సరఫరాతో పాటు సైనిక సాయం చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో వ్యాపారులు తుర్కియేతో వర్తక, వ్యాపారాలను నిలిపేస్తున్నారు. మన విశ్వవిద్యాలయాలు ఆ దేశ వర్సిటీలతో కుదుర్చుకున్న వివిధ రకాల ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి.
పర్యాటకం పైనా దెబ్బ!
మరోవైపు, పాక్‌కు వత్తాసు పలికిన తుర్కియే, అజర్‌బైజాన్ దేశాల పర్యాటక రంగంపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్ నుంచి వెళ్లే పర్యాటకులు, వివాహ వేడుకల కోసం అక్కడికి వెళ్లే వారి సంఖ్య, భారతీయ సినిమా చిత్రీకరణలు తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో మన ట్రావెల్ ఏజెన్సీలు కూడా తుర్కియేకు ఆన్‌లైన్ బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.





