
కశ్మీర్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి.. టెర్రరిస్టులను హతమార్చింది. దీంతో ప్రతీకారంగా పాక్ భారత్ పై తమ ఆర్మీతో దాడికి పాల్పడింది. దీంతో భారత్ పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పింది. పరస్పర దాడులతో యుద్ధ వాతావరణం నెలకొనడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకొని కాల్పుల విరమణకు ఇరు దేశాలను ఒప్పించాడు. అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లక్నో వేదికగా జరిగిన ఓ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఒకరోజు అదే ఉగ్రవాదం పాకిస్తాన్‌ను కూడా మింగేస్తుందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ దుశ్చర్యలకు సమాధానం. భారతదేశం వైపు వేలు చూపి భద్రతకు భంగం కలిగించే వారిని ఎవరూ వారి అంత్యక్రియలకు హాజరు కాలేని పరిస్థితిలో ఉంచుతారు. పంజాబ్‌లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించి సాయుధ దళాల స్ఫూర్తిని పెంచిన ప్రధాని మోడీకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము…” అని చెప్పుకొచ్చారు.





