News

అహల్యా బాయి పరిపాలన నేటికీ ఆదర్శం

404views

విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అహల్యా బాయి హోల్కర్ త్రిశత జయంతి వేడుకలు ఏర్పాటు కు వర్క్ షాప్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా అహల్యా భాయిపై పిపిటిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు కేంద్ర మాజీ మంత్రి మీనాక్షి లేఖీ వివరించారు. 30సంవత్సరాల పరిపాలన లో అహల్యా బాయి ఆలోచనలతో వికసిత్ రాష్ట్రంగా తీర్చి దిద్దారు. వికసిత్ రాష్ట్రంగా ఉండాలనే ఆలోచనలతో 200 సంవత్సరాల క్రితమే అహల్యా బాయి ముందు చూపుతో పరిపాలించారు. అహల్య భాయి ఒక మహిళగా సమాజం కోసం ఎంతగానో కృషి చేసారు. పీష్వాలకి ఉత్తర ప్రత్యుత్తరాలతో చాతుర్యతని ప్రదర్శించి, ఒక మహిళగా వారికి సమాధానం చెప్పి సమాజం కోసం నిలబడ్డారు. వనవాసీ మహిళల కోసం వారి అభ్యున్నతి కొరకు అహల్య ఆలోచనలు ఉండేవి.అహల్య బాయి దూర దృష్టితోనే మందిరాల పునః నిర్మాణాలు చేపట్టారని, కాశీ,రామేశ్వరం, శ్రీశైలం లాంటి దేవాలయాల నిర్మాణాలు చేపట్టారని తెలిపారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, మహిళలు అభివృద్ధి, వారి సంక్షేమం కోసం చట్టసవరణలు చేశారు. భర్తలు చనిపోయిన మహిళలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో భర్త ఆస్తి ఆ భార్యకి హక్కు ఉంటుందని చట్టసవరణ చేసి మార్పులు తీసుకొచ్చారు. దళితులకి భూమిలు కేటాయించటం వారికీ సంక్షేమం అందించటంలో ప్రముఖ పాత్ర వహించారు. 1795 వ సంవత్సరం ముందే ఇవన్నీ చేసారంటే అహల్య భాయి కి ఎంత ముందు చూపు ఉందొ అర్ధమవుతుందని తెలిపారు. చేనేత రంగం వెనకబడుతున్న పరిస్థితుల్లో మహేశ్వర్ అనే ప్రదేశంలో వారి ఉనికిని కాపాడి మహిళలలకి ఆత్మ నిర్భత్ తో ఒక ధైర్యాన్ని నింపారు.పాశ్చాత్య దేశాలు దేశం లోని గుడులు గోపురాలపై దాడులు నిర్వహించి, వాటిని కొల్లగొట్టడానికి వచ్చేవారు. వాటిని పరిరక్షించటానికి గర్భగుడి ఉండాలనే ఆలోచనలతో నిర్మాణాలు ఉండేవని,ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారత దేశం వరకు ఎన్నో ఆలయాలు నిర్మించి, శ్రీశైలం మల్లికార్జున దేవాలయం లాంటి ఎన్నో ప్రముఖ దేవాలయాలని పునః నిర్మించారని చెప్పారు.ప్రధాని మోదీ అహల్య బాయి స్ఫూర్తితో పరిపాలన చేస్తున్నారని అన్నారు.

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ, అహల్యా బాయి కార్యక్రమం ఇంఛార్జి పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ, బ్రిటిష్ గవర్నర్ రచించిన బుక్ లో అహల్య బాయి గురించి దివి నుంచి భువికేగిన దైవాంశ సంబూతులు అని పేర్కొన్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా అహల్య భాయి ప్రభావం ఎంతగానో ఉండేదని తెలిపారు.