పాకిస్తాన్‌పై సైలెంట్‌గా బాంబ్ వేసిన ఇండియన్ లేడీ యాంకర్.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వీడియో.. గ్లోబల్‌గా ట్రెండ్ చేయాల్సిందే..

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ ఇండియన్ లేడీ న్యూస్ యాంకర్ వీడియో ఫీడ్‌లో వచ్చేస్తోంది. పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా అసీఫ్‌ను సెకన్లలో రోస్ట్ చేయడమే ఇందుకు కారణం. కాగా ఇంటర్నేషనల్ మీడియా చానల్ సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసీఫ్.. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్తాన్ ఐదు భారత విమానాలను కూల్చేసిందని చెప్పాడు. CNN యాంకర్ ఇందుకు సంబంధించిన ఆధారాలను అడగ్గా.. సోషల్ మీడియా వీడియోలను సాక్షంగా చూపించాడు. ఈ విషయాన్ని ప్రస్తావించిన ఇండియన్ యాంకర్ పాల్కి శర్మ సెకన్లలో రోస్ట్ చేసి విడిచిపెట్టారు. ఇంత సీరియస్ ఇష్యూలో సోషల్ మీడియాను విశ్వసనీయమైన మూలంగా ఉపయోగించిన ఆయన.. నెక్స్ట్ టైమ్ ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్‌ను సూచిస్తాడేమోనని ఫన్నీగానే పంచ్ గట్టిగా వేసింది.
ఈ వీడియోను ‘సిస్ గాట్ నో చిల్’ అంటూ ట్రెండ్ చేస్తున్న నెటిజన్స్.. గ్లోబల్‌గా వైరల్ చేయాలని కోరుతున్నారు. ఇక దీనిపై స్పందిస్తున్న కొందరు.. ‘సెకన్లలో పాక్ పరువు తీసి పక్కన పెట్టేసింది’, ‘బెస్ట్ యాంకర్ ఇన్ ఇండియా’, ‘ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్ ఏదైతే ఉందో.. హహహ’, ‘పాకిస్తాన్‌పై సెలెంట్‌గానే బాంబ్ వేసింది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు పాక్ డిఫెన్స్ మినిస్టర్ సోషల్ మీడియాను ఆధారంగా చూపడంపై పెద్ద ఎత్తున మీమ్స్ వస్తున్నాయి.