News

జేఎన్టీయూ కాకినాడలో పాకిస్థాన్‌ జెండాను తొలగింపు

239views

జేఎన్టీయూ కాకినాడలో పాకిస్థాన్‌ జెండాను తొలగించారు. దానిని హిందూ సంఘాల నేతలు తీసుకెళ్లి తొలగించారు. తొలుత విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌, హిందూ సంఘాల నాయకులు భారత్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ జేఎన్టీయూకేలోకి వచ్చి పరిపాలనాభవనం ఎదురుగా ఉన్న పాకిస్థాన్‌ జెండాను తొలగించాలని కోరారు. దీనిపై ఉపకులపతి ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్కే ప్రసాద్‌ స్పందిస్తూ.. ఐరాసలో గుర్తింపుపొందిన 194 దేశాల జెండాలను గతంలో ఇక్కడ ఏర్పాటు చేశామని, దీనిలో మరో ఉద్దేశం లేదని వీసీ చెప్పారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది జెండాను తొలగించారు.