News

ఇక ఉగ్ర చర్యలను యుద్ధంగానే పరిగణిస్తాం – భారత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

120views

ఉగ్రవాదులు, వారికి మద్దతు పలికే వారికి భారత్‌ తాజాగా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. దేశంలో ఇక నుంచి ఎటువంటి ఉగ్రదాడులు జరిగినా ‘యుద్ధ చర్య’గానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. అందుకు తగు విధంగా స్పందిస్తామని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత్‌-పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.

భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్థాన్‌ డ్రోన్లు, క్షిపణులతో వరుసగా దాడులకు పాల్పడుతోంది. విమానాశ్రయాలు, సామాన్య పౌరులే లక్ష్యంగా దాయాది ఈ చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్ స్టాఫ్‌ అనిల్‌ చౌహాన్‌, త్రివిధ దళాధిపతులతో శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.