News

జీవో 77ను రద్దు చేసి ఐసెట్‌ నిర్వహించాలి : ఏబీవీపీ

393views

పీజీ చదవాలనుకునే పేద విద్యార్థులకు గుదిబండలా మారిన జీవో 77ను రద్దు చేసి, ఆతర్వాతే ఈ ఏడాది ఐసెట్‌ను నిర్వహించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో జీఓ 77 రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఒక విద్యా సంవత్సరం ముగిసిపోయిందని, లోకేష్‌ హామీ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది నిర్వహించే ఐసెట్‌కు ముందే జీఓను రద్దు చేయాలని, లేని పక్షంలో ఐసెట్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సమితి సభ్యుడు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.