News

5లక్షల మంది పాక్‌ యువతులు పెళ్లి చేసుకొని భారత్‌లో

335views

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు చెందిన 5లక్షల మంది యువతులు.. పెళ్లి చేసుకోవడం ద్వారా భారత్‌లోకి ప్రవేశించారని అన్నారు. భారత పౌరసత్వం కూడా లేకుండానే వారు ఇక్కడ నివసిస్తున్నారని తెలిపారు. ఇది పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి కొత్త రూపం అని ‘ఎక్స్‌’లో దూబే పేర్కొన్నారు. భారత్‌లోకి ఈ రూపంలో చొరబడ్డ శత్రువులతో ఎలా పోరాడగలమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీరి వీసాలపై దర్యాప్తు జరిపించాలన్నారు.