News

యాగం చేస్తే వర్షం పడుతుందా? పరిశోధన కోసం ఉజ్జయిని ఆలయానికి చేరుకున్న శాస్త్రవేత్తలు

490views

సనాతన ధర్మంలో ప్రకృతికి మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో నమ్మకాలున్నాయి. అలాంటి నమ్మకంలో ఒకటి వర్షం కురవడం కోసం చేసే వరుణ యాగం. ఆధునిక యుగంలో కూడా యజ్ఞ యగాలను.. వాటి వలన వచ్చే ఫలాల గురించి నమ్మకాలున్నాయి. ఈ నేపధ్యంలో మహాకాళేశ్వర్ ఆలయంలో శాస్త్రవేత్తలు సోమ యాగం గురించి అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం వెనుక ప్రధాన ఉద్దేశ్యం యజ్ఞం వల్ల వర్షం పడే అవకాశం ఉందో లేదో తెలుసుకోవడం.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయంలో దేశవ్యాప్తంగా మంచి వర్షాలు కురవాలని ఒక పెద్ద యాగం నిర్వహించారు. ఈ యాగం జరిగే ప్రదేశానికి ఏప్రిల్ 24న శాస్త్రవేత్తల బృందం చేరుకుంది. ఈ యాగం ఏప్రిల్ 24 మొదలైన ఈ యాగం ఏప్రిల్ 29 వరకు నిర్వహించారు. ఈ యాగం చేయడం వలన వర్షంపై ఎంత ప్రభావం చూపుతుంది? అనే విషయాన్ని తెలుసుకోవడానికి, శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేస్తుంది. ఈ మేరకు శాస్త్రవేత్తల బృందం ఆలయానికి చేరుకుని అధ్యయనం చేయడం మొదలు పెట్టారు.

మధ్యప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ , సైంటిఫిక్ కౌన్సిల్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండోర్ , ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ IITM లు ఒక పరిశోధన ప్రాజెక్టును ప్రారంభించాయి.

పరిశోధన ప్రాజెక్ట్ ప్రారంభం
సోమవల్లి.. దీనిని సోమలత అని కూడా అంటారు. ఈ మొక్క హిందువులు ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ ఔషధ మొక్క సోమవల్లి (సార్కోస్టెమ్మ బ్రీవిస్టిగ్మా, ఒక రకమైన ఒలియాండర్) రసాన్ని సోమ యజ్ఞం (హవన) లో అగ్నికి సమర్పిస్తారు. ఇలా చేయడం ప్రభావవంతంగా ఉంటుందో లేదో తెలుసుకోవడానికి ఈ పరిశోధన ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. ఇది పర్యావరణాన్ని శుభ్రపరుస్తుంది. అవపాతానికి దారితీసే మేఘాల సంగ్రహణను నిరోధించగలదు.