News

వెల్లువెత్తున్న ఆందోళనలు.. జాతీయ జెండాలతో ఎన్నారైలు నిరసనలు

208views

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై ప్రపంచ దేశాలు స్పందించాలని డిమాండ్ చేశారు. కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లో ఎన్నారైలు జాతీయ జెండాలు చేత పట్టి నిరసనలు తెలిపారు. 400 మందికిపైగా కాశ్మీరీ పండితులు, మిత్రులు, స్నేహితులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పహల్గామ్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా గళమెత్తారు.

అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, జర్మనీ, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, స్పెయిన్‌లో భారతీయులంతా రోడ్లపైకి వచ్చి భారీ నిరసనలు తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు జేశారు. జాతీయ జెండాలను పైకి ఎత్తి ఊపారు. ఇలా పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా నిరసనలు తెలిపారు. పహల్గామ్ ఉగ్ర దాడిలో చనిపోయిన 26 కుటుంబాలకు న్యాయం జరగాల్సిందేనని డిమాండ్ చేశారు.