News

చిత్తూరులో కొవ్వొత్తుల ర్యాలీ

211views

ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చీఫ్ సెక్రటరీ బుల్లెట్ రవి కోరారు. చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఉగ్రవాదుల దాడిలో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయులను అతి కిరాతకంగా చంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.కేంద్ర ప్రభుత్వం మ్రృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు.