
210views
జమ్మూ-కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వలసదారులపై ప్రత్యేక నిఘా పెట్టాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌లో చేపట్టిన భారీ ఆపరేషన్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన 1,000 మందికిపైగా అక్రమ వలసదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తప్పుడు ధ్రువపత్రాలతో రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ శనివారం వెల్లడించారు. అహ్మదాబాద్‌లో 890 మందిని, సూరత్‌లో 134 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరంతా పశ్చిమ బెంగాల్‌లో సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. అక్కడ ఫోర్జరీ పత్రాలు పొంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు వివరించారు. వీరందరి పత్రాలను పరిశీలించిన తర్వాత.. త్వరలోనే దేశం నుంచి పంపిస్తామని హర్ష్ సంఘ్వీ వెల్లడించారు.





