News

దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి : సునీల్ అంబేకర్

296views

పహల్గామ్ ఉగ్రదాడిపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ స్పందించారు.పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిందని, హిందువులపై దాడి జరిగిందని, ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఈ దాడికి పాలక్పడిన ఇస్లామిక్ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్ లో సుస్థిరంగా అభివృద్ధి, శాంతి కొనసాగుతోందని, అభివృద్ధి వేగం పుంజుకుందన్నారు. ఈ అభివృద్ధిని ఆపడానికి, శాంతికి భంగం కలిగించడానికి ఇస్లామిక్ ఛాందసులు దాడికి దిగారన్నారు.

ఈ దాడి దేశ శాంతిపై ఐక్యతపై దాడిగా సునీల్ అంబేకర్ అభివర్ణించారు. దాడి చేసిన ఉగ్రవాదులకు తగిన గుణపాఠం నేర్పించాలన్నారు. ఇకపై దాడి చేయడానికి కూడా వారికి ధైర్యం సరిపోకూడదని, అలాంటి శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.

హిందువులని గుర్తించి మరీ, దాడికి దిగడం చూస్తుంటే అత్యంత కోపం తెప్పించే అంశమన్నారు. పర్యాటకుల దగ్గర ఎలాంటి ఆయుధాలు కూడా లేవని, అలాంటి వారిపై దాడికి దిగారన్నారు.ఇస్లామిక్ ఉగ్రవాదులు వారిపై కుట్రలు పన్నారని, దీనిని అందరూ ఖండించారన్నారు. ఈ దాడికి సంబంధించిన అంశం దేశ అఖండతకి సంబంధించిన అంశమని, అందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం తగిన సహాయం, న్యాయం చేయాలన్నారు. దాడికి దిగిన ఇస్లామిక్ ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని, వారికి తగిన శిక్షలు విధిస్తేనే సరైన న్యాయం చేసినట్లు అని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వం ఈ దిశలోనే ఆలోచిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.