News

గుంటూరులో బిజెపి శాంతి ర్యాలీ

317views

కాశ్మీర్లో అమాయక ప్రజల పైన జరిగినటువంటి అమానుషమైన దాడికి నిరసనగా గుంటూరు నగరంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. స్థానిక లాడ్జి సెంటర్ నుంచి శంకర్ విలాస్ వరకు భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పెహల్గామ్ మృతులకు ఆత్మ శాంతి జరగాలని కోరుకున్నారు. కార్యక్రమంలో పాల్గోన్న బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ,
సరిహద్దు ఉగ్రవాదులు పహల్గామ్‌లో అమాయక పౌరులపై జరిపిన క్రూరమైన మరియు పిరికితనంతో కూడిన దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఈ నీచమైన దాడిలో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరుల జ్ఞాపకాలను మేము గౌరవిస్తున్నామన్న ఆయన, వారి కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతిని తెలియచేశారు. గత 10 సంవత్సరాలుగా, బిజెపి పార్టీ ఉగ్రవాద మూలాలకు బలమైన దెబ్బ వేసి, వారి నిధుల నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేసిందన్న జయ ప్రకాష్, శత్రువులు మరింత బలమైన ప్రతిస్పందనను ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షులు తిరుపతయ్య తదితరులు పాల్గోన్నారు.