
హిందూ సమాజం మేల్కొనాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్-ఆర్ఎస్ఎస్ మహానగర్ సంఘచాలక్ పివి నారాయణరావు అన్నారు. విశాఖపట్నం జిల్లా సింహాచలంలో ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ జరిగిన మెగా ఆస్ట్రో సెమినార్ లో అయినా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. టీవీల్లో ఏ ఛానల్ చూసినా కుటుంబ విధ్వంసక సీరియల్స్ వస్తున్నాయని, దీన్ని నిరోధించాలని ఆయన కోరారు. హిందూ ధర్మ పరిరక్షణకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. వక్ఫ్ చట్టాన్ని ప్రధానమంత్రి పకడ్బందీగా రూపొందించారని అన్నారు. ఈ విషయంలో అందరూ ప్రధానికి మద్దతుగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
తిరుమల అనంతాళ్వార్ వంశానికి చెందిన 26వ తరం అర్చక స్వామి టి ఏ పి నారాయణ మాట్లాడుతూ పిల్లలకు మన హిందూ సాంప్రదాయాలు నేర్పాలని కోరారు.

ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక అధ్యక్షులు నరసింహ స్వామి మాట్లాడుతూ మన దగ్గరికి వచ్చే వారికి అన్ని విషయాలు తెలుసుకుని తప్పులు లేని ముహూర్తాలు నిర్ణయించాలని కోరారు. ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలు ఇస్తాయో జన్మ కుండలి చార్ట్ చూసే చెప్పగలిగే ప్రావీణ్యం జ్యోతిష్యులు సంపాదించాలని అభిలాషించారు. అనంతరం ఆయన రాసిన ముహూర్తం అనే పుస్తకాన్ని ముఖ్య అతిధులు ఆవిష్కరించారు. అనంతరం ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో సంస్థ ఆధ్వర్యంలో జ్యోతిషం లో పిహెచ్ డి చేసిన పది మందికి బెంగళూరు శ్రీ శుక్రాచార్య యూనివర్సిటీ పట్టా ప్రదానం చేశారు.అలాగే జ్యోతిషం లో వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన పలువురికి సర్టిఫికెట్ ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు వాస్తు జ్యోతిష పండితులు పాల్గొని విలువైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ్ మహేష్, కామేశ్వరరావు, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ కు చెందిన శేషారావు వ్యాఖ్యతగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్నారు.





